Tata Sumo 2025 | దేశీయ ఆటోమొబైల్ రంగం త్వరలో ప్రారంభం కానున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో -2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పలు పెద్ద కంపెనీలు కొత్త, మోడ్రన్ వాహనాల ఆవిష్కరణకు సిద్ధం అయ్యాయి. అందులో టాటా మోటార్స్ కూడా చేరింది. ఆటో ఎక్స్‌పోలో తన టాటా సుమో -2025 కారును ఆవిష్కరించనున్నది. సుదీర్ఘకాలంగా టాటా సుమో కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. టాటా సుమో -2025 కారు ధర కోసం పలువురు సెర్చింగ్ చేశారు కానీ టాటా మోటార్స్ దాని గురించి బయట పెట్టలేదు.
టాటా సుమో-2025 ఎస్యూవీ నూతన అవతార్‌లో ప్రజల ముందుకు వస్తోంది. ఆరుకు పైగా సేఫ్టీ బ్యాంకు, అడాస్ టెక్నాలజీ, ఈబీడీతోపాటు ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు జత చేశారు. టాటా సఫారీ, టాటా హారియర్ తరహాలో టాటా సుమో-2025 స్టైల్ ఉంటుందని భావిస్తున్నారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌తోపాటు పలు కలర్ ఆప్షన్లలో రానున్నది. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటాయి. టాటా సుమో 2025 ధర రూ.12 – 15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని వార్తలొస్తున్నాయి.
టాటా సుమో – 2025 కారు పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్లతో వస్తుందని తెలుస్తున్నది. ఈ ఏడాది ఆవిష్కరించిన కొత్త కార్లలో టాటా సుమో – 2025 గొప్ప కారుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు ధరను వెల్లడించడానికి టాటా మోటార్స్ కొంత సమయం తీసుకుంటుందని సమాచారం.