Moto G05 | రూ.6999లకే మోటో జీ 05 స్మార్ట్ ఫోన్.. ఇవీ స్పెషికేషన్స్..!
Moto G05 ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ05 ఫోన్‌ను భారత్ మార్కెట్లో మంగళవారం ఆవిష్కరించింది.
Moto G05 ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ05 ఫోన్‌ను భారత్ మార్కెట్లో మంగళవారం ఆవిష్కరించింది. మీడియాటెక్ హెలియో జీ68 ఎస్వోసీ ప్రాసఎసర్ ఉంటుది. 18వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 50 -మెగా పిక్సెల్స్ మెయిన్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ చేయడానికి 8- మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
మోటో జీ05 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,999లకు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, మోటరోలాఇండియా. వెబ్ సైట్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 13 నుంచి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో లభిస్తాయి. ఫారెస్ట్ గ్రీన్, ఫ్లమ్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రిలయన్స్ జియో యూజర్లు కొనుగోలు చేస్తే రూ.2,000 క్యాష్ బ్యాక్, రూ.3000 వరకూ అదనపు ఓచర్ బెనిఫిట్లు, జియో యూజర్లు రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ పొందొచ్చు.
మోటో జీ05 ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటాయి. మీడియాటెక్ హెలియో జీ81 ఎక్స్ట్రీమ్ ఎస్వోసీపై పని చేస్తుంది. వర్చువల్ ర్యామ్ మరో 12 జీబీ పొడిగించుకోవచ్చు. కానీ ఫోన్ స్టోరేజీ మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు.ఆండ్రాయిడ్ 15 బేస్డ్ హెల్లో యూఐ స్కిన్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్.
మోటో జీ05 ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తోపాటు 6.67 అంగుళాల హెచ్డీ+ (720×1612 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రిన్ ఉంటుంది. 50- మెగా పిక్సెల్ మెయిన్ రేర్ కెమెరా విత్ క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8- మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
మోటో జీ05 ఫోన్ 18వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. డ్యుయల్ 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.0, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, ఏ-జీపీఎస్,గ్లోనాస్ గెలీలియో, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. సెక్యూరిటీకోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

