Amazon Great Republic Day Sale 2025 | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కొత్త ఏడాదిలో ఈ నెల 13 నుంచి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభించనున్నది. సాధారణ కస్టమర్లకు అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి, అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఒకరోజు ముందు 12 గంటల ముందే అంటే 11వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ నెల 19వరకూ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లపై పదిశాతం డిస్కౌంట్ అందిస్తుంది. ఈఎంఐ లావాదేవీలపైనా డిస్కౌంట్ పొందొచ్చు. ఐసీఐసీఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డుమీద ఐదు శాతం రాయితీ లభిస్తుంది.
పాత స్మార్ట్ ఫోన్ల ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.45 వేల వరకూ, లాప్ టాప్ల మీద రూ.7,000, స్మార్ట్ టీవీల మీద రూ.5,500, గృహోపకరణాలపై రూ.15 వేల వరకూ డిస్కౌంట్లు లభిస్తాయి. కొన్ని ఉత్పత్తులపై 75 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై 65 శాతం, మొబైల్ ఫోన్లు- వాటి యాక్సెసరీలపై 40 శాతం రాయితీ లభిస్తుంది.
స్మార్ట్ ఫోన్లలో ఆపిల్, ఐక్యూ, వన్ప్లస్, శాంసంగ్, రియల్మీ, రెడ్మీ సంస్థల స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. వన్ప్లస్ నార్డ్ 4 సీఈ, వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్లపై ఆఫర్లు లభిస్తాయని అమెజాన్ తెలిపింది. వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 13ఆర్ ఫోన్లు కూడా ఈ సేల్లోనే విక్రయిస్తారు.
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లైట్ రూ.2,599, ఎకో పాప్పై రూ.3949, ఎకో ఫోర్త్ జెన్ పై రూ.7549, ఎకో షో 8లపై నుంచి రూ.9,999 డిస్కౌంట్ లభిస్తుంది. ఆపిల్ వాచ్ ఎస్ఈ (సెకండ్ జెన్) రూ.24,900లకు బదులు రూ.19,999లకు లభిస్తుంది. గతేడాది ఆవిష్కరించిన లెనెవో టాబ్ ప్లస్ రూ.22,999 నుంచి రూ.18,999లకే సొంతం చేసుకోవచ్చు.