Elon Musk | ప్రపంచ వ్యాప్తంగా జనాభా తగ్గుదలపై (Population Decline) అపరకుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటిగా పేర్కొన్నారు.
జనాభా క్షీణతకు సంబంధించిన ఓ గ్రాఫ్‌ను (Population Decline graph) టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ (Tesla Owners Silicon Valley) ఎక్స్‌లో పోస్టు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్, చైనా (India And China) సహా నైజీరియా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్థాన్ వంటి కీలక దేశాల్లో 2018 నుంచి 2100 మధ్య జనాభాలో ఎలాంటి మార్పులు ఉండనున్నాయనే దాన్ని ఈ గ్రాఫ్‌లో చూపించారు.
ముఖ్యంగా భారత్, చైనా దేశాల్లో 2100 నాటికి జనాభా క్షీణత తీవ్రంగా ఉంటుందని ఆ గ్రాఫ్‌లో అంచనా వేశారు. ఈ గ్రాఫ్‌ను పోస్టు చేసిన టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ.. ‘జనాభా తగ్గుదల మానవాళికి అత్యంత ముప్పు’ అని పేర్కొంది. ఈ ట్వీట్‌ను రీపోస్ట్ చేసిన మస్క్.. ‘అవును’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Elon Musk (@elonmusk) January 7, 2025
Also Read..
Justin Trudeau | అమెరికాలో విలీనమవడం అసాధ్యం.. ట్రంప్ ప్రతిపాదనపై ఘాటుగా స్పందించిన ట్రూడో