న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ టూర్‌కు వెళ్లి వచ్చిన రెండు రోజులుకే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడికి దిగిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ పర్యటన ముగిసిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై అటాక్ జరగడం పట్ల భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజర్(Ambassador Reuven Azar) క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లారు. ప్రధాని మోదీ చేపట్టిన ఉన్నత స్థాయి దౌత్య పర్యటనకు ముందే.. ప్రాంతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్లు అజర్ వెల్లడించారు.
ప్రధాని మోదీ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించారు. అయితే ఆ సమయం కన్నా ముందే.. తమ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అందరికీ తెలిసిందే అని అజర్ అన్నారు. మోదీ టూర్‌తో సంబంధం లేకుండా.. సైనిక ఆదేశాల ప్రకారం దాడి జరిగినట్లు ఆయన చెప్పారు. వ్యూహాత్మక అంచనాలు వేసిన తర్వాతే ఇరాన్‌పై అమెరికాతో కలిసి దాడికి దిగినట్లు అంబాసిడర్ రూవెన్ అజర్ చెప్పారు. దాడి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే, ప్రధాని మోదీ వచ్చి వెళ్లిన తర్వాతే మిలిటరీ ఆపరేషన్ చేపట్టే అవకాశం వచ్చిందని ఆయన అన్నారు.
ఇరాన్‌పై దాడికి, మోదీ ట్రిప్‌కు లింకు ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. తమ ప్రాంతం నుంచి మోదీ వెళ్లిపోయిన తర్వాతే దాడి చేసేందుకు అనుమతి వచ్చినట్లు చెప్పారు. మోదీ పర్యటన ముగింపునకు, సైనిక చర్య చేపట్టడానికి మధ్య రెండు రోజుల సమయం పట్టిందని, అయితే క్యాబినెట్ నిర్ణయం తర్వాతే దాడికి పాల్పడినట్లు అజర్ చెప్పారు. అమెరికాకు కానీ, ఇజ్రాయెల్‌కు కానీ ఇరాన్‌ను ఆక్రమించాలన్న ఉద్దేశం లేదన్నారు. కేవలం ఇరాన్లో అంతర్గత మార్పులు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
పశ్చిమాసియా ప్రాంతంలో స్థిరత్వాన్ని, భద్రతను కల్పించాలన్నదే ఇజ్రాయెల్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇరానీ ప్రజలు తమ దేశ విధానాలను, నాయకులను మార్చుకోవాలన్నారు. నిజానికి ఇరాన్లో ఆ మార్పు జరుగుతుందో లేదో తెలియదు అని, కానీ ఇరానీ ప్రజల్లో ప్రభుత్వ మార్పుపై దృష్టిపెట్టేలా చర్యలు చేపడుతామన్నారు.