కాలిఫోర్నియా: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు(Los Angeles Wildfires) భీకరంగా మారింది. గంటల వ్యవధిలోనే.. ఆ మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. వేల వేల హెక్టార్లలో అడవులు అంటుకుంటున్నాయి. దీంతో లాస్ ఏంజిల్స్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 10 ఎకరాల నుంచి మూడు వేల ఎకరాల వరకు మంటలు వ్యాపించినట్లు అధికారులు చెప్పారు. దాదాపు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించినట్లు అగ్నిమాపక సిబ్బంది చీఫ్ క్రిస్టిన్ క్రౌలే తెలిపారు. సుమారు 13 వేల బిల్డింగ్‌లకు ప్రమాదం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. హాలీవుడ్ నటులు ఉండే ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.
🔥 #Wildfire Hits LA Districts, Firefighters Face Challenges
A wildfire in Pacific Palisades grows to 1,261 acres, with footage spreading on social media. #LosAngeles #US #Sputnik pic.twitter.com/SpFBqeNoiU
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) January 8, 2025
మంగళవారం సాయంత్రం లాస్ ఏంజిల్స్‌లో దావానలం మొదలైంది. గాలి తీక్షణంగా వీయడంతో.. అడవి మంటలు వేగంగా వ్యాపించాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లక్షలాది మంది వార్నింగ్ జోన్లో ఉన్నట్లు తెలిపారు. తీవ్రమైన రీతిలో కార్చిచ్చు ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు. లాస్ ఏంజిల్స్ కొండల్లో విస్తరిస్తున్న మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
🔥 Horrific Firestorm in Los Angeles: Palisades Fire Worsens
The Palisades Fire has turned into a terrifying firestorm, now crossing to the west side of Topanga Canyon Blvd. Over 1,300 acres have been consumed, with many homes tragically lost.
Firefighters are battling… pic.twitter.com/HUvb8nrhB9
— Ali Shunnaq (@schunnaq) January 8, 2025
పసిఫిక్ పాలిసేడ్స్ అనే ప్రాంతంలో సుమారు 12 స్క్వేర్ కిలోమీటర్ల అడవి కాలిపోయింది. శాంటి మోనికా, మాలిబు పట్టణాల మధ్య ఈ ప్రాంతం ఉన్నది. శక్తివంతమైన గాలులు వీయడం వల్ల కూడా కార్చిచ్చు మరింత ప్రమాదకరంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు.లాస్ ఏంజిల్స్ కౌంటీలోని 46 వేల ఇండ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆల్టడేనా ప్రాంతంలో సుమారు 200 ఎకరాల్లో అడవికి మంటలు అంటుకున్నాయి. హాలీవుడ్ నటులు యూజీన్ లెవి, జేమ్స్ వుడ్స్ తో పాటు ఇతర సెలబ్రిటీలు ఇండ్లు వదిలి వెళ్లారు.
🚨🚨 SCARY VISUALS
Smoke from the #PalisadesFire nearly blocks out the sunset in Los Angeles looks like the blaze is headed inland towards Brentwood.
The California wildfire has burnt around 1200 acres so far and spreading rapidly.#PalisadesFire #palisadesfires pic.twitter.com/qWWFwvz8jV
— GeoPol News (@GeoPolNewz) January 8, 2025