Encounter | దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. సోమవారం ఉదయం ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని దంతెవాడ (Dantewada) జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు (Encounter) చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి (Woman Naxal killed) చెందింది.
సోమవారం ఉదయం జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) ఆధ్వర్యంలోని భద్రతా దళాల బృందం దంతెవాడ జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో రేణుక అలియాస్ బాను అనే మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమె రూ.25 లక్షల రివార్డు ఉన్న దండకారణ్య స్పెషల్ కమిటీ (DKSZC)కి చెందినదిగా గుర్తించారు. ఘటనాస్థలి నుంచి మహిళా మావోయిస్టు మృతదేహంతోపాటు ఇన్సాస్ రైఫిల్, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. బస్తర్ రేంజ్లో ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన ఎన్కౌంటర్లలో 119 మంది నక్సలైట్ల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు.
Also Read..
Mamata Banerjee: ఎరుపు, కాషాయం కలిసి పనిచేస్తున్నాయి: మమతా బెనర్జీ
Ayodhya Ram temple | నవమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామాలయం