Diamond Workers | సూరత్: బీజేపీ పాలిత గుజరాత్లో లక్షలాది మంది వజ్రాల పరిశ్రమ కార్మికులు సమస్యల సుడి గుండంలో అల్లాడిపోతున్నారు. వజ్రాల ప్రాసెసింగ్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సూరత్‌లో దాదాపు 2,500 యూనిట్లలో సుమారు 10 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రపంచంలో దాదాపు 90 శాతం ముడి వజ్రాల కటింగ్, పాలిషింగ్ ఇక్కడే జరుగుతాయి.
డిమాండ్లను పరిష్కరించాలంటూ వందలాది మంది కార్మికులు ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. డైమండ్ వర్కర్స్ యూనియన్ గుజరాత్ ఉపాధ్యక్షుడు భవేష్ టంక్ మాట్లాడుతూ, రెండేళ్ల నుంచి వజ్రాల పరిశ్రమ మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నదని, కార్మికులకు సరైన పని, వేతనాలు ఉండటం లేదని చెప్పారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తమ సమస్యలను సీఎం భూపేంద్ర పటేల్‌కు విన్నవించామని అన్నారు.