శ్రీనగర్: వారం రోజుల కిందట అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికిన (Woman Body Chopped) నిందితుడు పలు ప్రాంతాల్లో వాటిని పడేశాడు. దీంతో అతడ్ని ఉరి తీయాలంటూ భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహా సంఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. బుద్గామ్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళ ఈ నెల 7న అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆ మహిళకు ఇటీవల ఒక వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. అయితే పరిచయం ఉన్న 45 ఏళ్ల షబీర్ అహ్మద్, మరో వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. కార్పెంటర్‌గా పని చేసే అతడు వారం కిందట ఆ మహిళను కిడ్నాప్ చేశాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం మహిళ మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికాడు. ఆమె శరీర భాగాలను పలు ప్రాంతాల్లో పడేశాడు.
కాగా, మహిళ మిస్సింగ్‌పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు షబీర్ అహ్మద్‌ను అరెస్ట్ చేశాడు. అతడు చెప్పిన ప్రాంతాల్లో వెతికి హత్యకు గురైన మహిళ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం తర్వాత ఆమె కుటుంబానికి అప్పగించారు.
మరోవైపు మహిళ దారుణ హత్యపై స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. నిందితుడు షబీర్ ఇంటి వద్ద భారీగా నిరసన తెలిపారు. అతడ్ని తమకు అప్పగించాలని, అదే శిక్ష విధిస్తామంటూ జనం నినాదాలు చేశారు. కశ్మీర్లో ఇలాంటి సంఘటన జరుగడం చాలా అరుదని అన్నారు. ఇలాంటి ఘోరానికి పాల్పడిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Woman Killed, Body Chopped Up In Kashmir; Hang Accused, Say Protesters https://t.co/BvnPgPpnbu pic.twitter.com/8W8Rbq21wh
— NDTV (@ndtv) March 12, 2023