సిమ్లా: కారు డ్రైవ్ చేసిన మహిళ దానిని పార్కింగ్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే అదుపుతప్పిన కారు 30 అడుగుల ఎత్తు నుంచి దిగువన ఉన్న గుంతలో పడింది. కారు ధ్వంసం కాగా అందులో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడింది. (Woman Driver Falls Into Ditch) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం కారు నడుపుతున్న మహిళ పార్కింగ్ కోసం ప్రయత్నించింది. రివర్స్ చేస్తుండగా ఆ కారు అదుపుతప్పింది. దిగువన ఉన్న 30 మీటర్ల లోతైన గుంతలో పడింది. బోల్తా పడిన కారు ధ్వంసం కాగా అందులో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడింది.
కాగా, పెద్ద శబ్దం విన్న స్థానికులు ఎత్తుగా ఉన్న రోడ్డు నుంచి కిందకు కారు పడటాన్ని గమనించారు. పరుగున కారు వద్దకు చేరుకున్నారు. కాళ్లు, చేతులకు గాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో కొండ ప్రాంతాల్లో వాహనాలు నడపటం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
While parking the car near power house road in #Solan, the woman lost control of the car and the car fell into a ditch about 30 meters ditch. The woman suffered from serious injuries and was admitted to the hospital. pic.twitter.com/W3nEYwwOmH
— Nikhil Choudhary (@NikhilCh_) July 8, 2024