హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హైదారాబాద్లోని కొండాపూర్ 99 TV నూతన భవనాన్ని ప్రారంభించారు. ఛానెల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెంబడి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ తదితరులు ఉన్నారు.
99 TV ని 2014 జూలై 20న హైదరాబాద్లో సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజా స్థాపించారు. ఆ తర్వాత 2018 జూలై 11న ఈ సంస్థ తోట చంద్రశేఖర్ నేతృత్వంలోని న్యూవేవ్స్ మీడియా యాజమాన్యంలోకి వెళ్లింది. ప్రస్తుతం న్యూ వేవ్స్ మీడియా యాజమాన్యంలో ఈ సంస్థ పనిచేస్తుంది. కేటీఆర్ భవనాన్ని ప్రారంభించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
99 చానల్ నూతన భవనాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ @sravandasoju కూడా పాల్గొన్నారు. pic.twitter.com/LVcvm53Q4Y
— BRS Party (@BRSparty) January 8, 2026