లక్నో: ఇద్దరు యువతులు స్కూటీపై ప్రయాణించారు. ఒక రేసింగ్ బైక్ వేగంగా వారిని ఢీకొట్టింది. ఒక యువతిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. మరో మహిళ చికిత్స పొందుతున్నది. (Woman Hit By Speeding Bike) ఒక బైక్‌కు ఉన్న ఇన్స్టాగ్రామ్ స్టిక్కర్ ద్వారా ఒక నిందితుడ్ని పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల భవికా గుప్తా కాలేజీలో మూడో ఏడాది చదువుతున్నది. నవంబర్ 6న గురువారం సాయంత్రం స్నేహితురాలైన నేహా మిశ్రాతో కలిసి స్కూటీపై గంగా బ్యారేజీ వద్దకు వెళ్లింది.
కాగా, నలుగురు వ్యక్తులు రెండు బైకులపై రేసింగ్ నిర్వహించారు. బ్యారేజీ నుంచి తిరిగి వస్తున్న మహిళల స్కూటీని ఒక బైక్ వేగంగా ఢీకొట్టింది. రోడ్డుపై పడిన భవికాను సుమారు 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఆమెతో పాటు నేహా తీవ్రంగా గాయపడింది. స్థానికులు వారిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో భవికా మరణించింది. నేహా చికిత్స పొందుతున్నది.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పడి ఉన్న నిందితులకు చెందిన ఒక బైక్‌ను పరిశీలించారు. దానిపై బ్రిజేష్ నిషాద్ పేరుతో ఇన్స్టాగ్రామ్ స్టికర్ ఉన్నది.
కాగా, ఆ ప్రమాదం గురించి ఆ ఇన్‌స్టాలో ఉన్న ఒక పోస్ట్‌ను పోలీసులు పరిశీలించారు. ‘గంగా బ్యారేజీ వద్ద ప్రమాదం జరిగింది. మీరు బతికే ఉన్నారా? లేదా చనిపోయారా?. ఆ అమ్మాయిలను మీరు చంపారు’ అని ఉన్నది. దీనికి మరో వ్యక్తి రిప్లై ఇచ్చాడు. బ్రిజేష్ నిషాద్ తన బైక్‌తో అమ్మాయిల స్కూటీని ఢీకొట్టినట్లు పేర్కొన్నాడు. నిందితుడి బైక్ రైడ్స్, రేసింగ్‌లకు సంబంధించిన ఇతర వీడియోలు కూడా ఆ ఇన్‌స్టాలో ఉన్నాయి.
మరోవైపు మృతురాలు భవికా తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Duping Techie For Rs.14 Crore | దేవతగా చెప్పుకున్న మహిళ.. టెక్కీని రూ.14 కోట్లకు మోసగింత
Two Women Marry | సామాజిక కట్టుబాట్లను అధిగమించి.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
Watch: బీహార్ ఎంపీ రెండు చేతుల వేళ్లకు ఎన్నికల సిరా.. రెండు ఓట్లు వేసినట్లు ఆరోపణలు