ముంబై: తనను తాను దేవతగా చెప్పుకున్న మహిళ ఒక టెక్కీని మోసగించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతడి ఇద్దరు కుమార్తెలను ‘ఆధ్యాత్మిక శక్తుల’ ద్వారా నయం చేస్తానని నమ్మించింది. ఆ టెక్కీ నుంచి రూ.14 కోట్లు వసూలు చేసింది. (Duping Techie For Rs.14 Crore) అతడి ఫిర్యాదుతో ఆ మహిళతోపాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీపక్ డోలస్కు చెందిన ఇద్దరు కుమార్తెలు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తనను తాను దేవతగా చెప్పుకునే మహిళ వద్దకు అతడు వెళ్లాడు.
కాగా, తనకు ‘ఆధ్యాత్మిక శక్తులు’ ఉన్నాయని ఆ మహిళ తెలిపింది. దైవ శక్తితో దీపక్ కుమార్తెల ఆరోగ్యం నయం చేస్తానని నమ్మించింది. అతడి నుంచి రూ.14 కోట్లు వసూలు చేసింది. దీని కోసం దీపక్ ఆస్తులను నమ్మకంగా అమ్మించింది. బ్రిటన్‌లో పని చేసినప్పుడు అక్కడ కొనుగోలు చేసిన ఇల్లు, పూణేలోని రియల్ ఎస్టేట్ భూమి, సొంత గ్రామంలోని పొలాన్ని పలు దఫాలుగా దీపక్ విక్రయించాడు. సుమారు రూ.14 కోట్లు ఆ మహిళకు ఇచ్చాడు.
అయినప్పటికీ దీపక్ కుమార్తెల అనారోగ్యం నయం కాలేదు. దీంతో దైవ శక్తులున్నట్లు నమ్మించిన ఆ మహిళ తనను మోసం చేసినట్లు అతడు గ్రహించాడు. పూణే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కోత్రుడ్ పోలీస్ స్టేషన్లో మోసం కేసు నమోదు చేశారు. ఆర్థిక నేరాల విభాగానికి ఆ కేసును బదిలీ చేశారు. దేవతగా చెప్పుకుని టెక్కీని మోసగించిన ఆ మహిళతోపాటు మరో ఇద్దరు నిందితులను నాసిక్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: బీహార్ ఎంపీ రెండు చేతుల వేళ్లకు ఎన్నికల సిరా.. రెండు ఓట్లు వేసినట్లు ఆరోపణలు
Seniors rag juniors | సైనిక స్కూల్లో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్.. వీడియో వైరల్