తిరువనంతపురం: ఒక ఆలయం మలువు వద్ద రోడ్డు డివైడర్ నిర్మిస్తున్నారు. దీంతో వాహనాలు కొంతదూరం వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆ రోడ్డు డివైడర్‌ను సుత్తితో ధ్వంసం చేశారు. (Former MLA Destroy Road Divider) దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. త్రిస్సూర్-కుట్టిప్పురం రహదారిలోని ముత్తువర మహాదేవ ఆలయం సమీపంలో టూ టర్న్‌ను పీడబ్ల్యూడీ మూసివేసింది. రహదారి పునరాభివృద్ధిలో భాగంగా అక్కడ డివైడర్ నిర్మిస్తున్నది. దీంతో ఆలయానికి చేరుకునే భక్తులు తమ వాహనాల్లో కొంత దూరం ప్రయాణించి యూ టర్న్ తీసుకోవాల్సి వస్తున్నది.
కాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిల్ అక్కర శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకున్నారు. డివైడర్ నిర్మాణం వల్ల ఆలయానికి వెళ్లే భక్తులకు ఇబ్బంది కలుగుతున్నదని ఆయన ఆరోపించారు. పార్టీ కార్యకర్త నుంచి సుత్తి తీసుకుని డివైడర్‌ను ధ్వంసం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆయన చర్యను అడ్డుకున్నారు.
మరోవైపు రోడ్డు డివైడర్ నిర్మిస్తున్న కాంట్రాక్ట్ సంస్థ ఈకేకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిల్ అక్కర ప్రజా ఆస్తిని ధ్వంసం చేసినట్లు ఆరోపించింది. డివైడర్ ధ్వంసం వల్ల రూ.19,600 నష్టం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అనిల్ అక్కరపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read:
Watch: బీహార్ ఎంపీ రెండు చేతుల వేళ్లకు ఎన్నికల సిరా.. రెండు ఓట్లు వేసినట్లు ఆరోపణలు
Seniors rag juniors | సైనిక స్కూల్లో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్.. వీడియో వైరల్
Man Robbed, Loses Leg | రైల్వే పోలీసుల నిర్లక్ష్యం.. కాలు కోల్పోయిన వ్యక్తి