Watch: రద్దీ రోడ్డులో అకస్మాత్తుగా క్యాబ్ డోర్ తెరిచిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Abruptly Opened Cab Door | రద్దీ రోడ్డులో ఆగిన క్యాబ్ డోర్‌ను ఒక మహిళ అకస్మాత్తుగా తెరిచింది. ఆ కారు నుంచి ఆమె దిగింది. ఇంతలో ఒక ఆటో ఆ క్యాబ్ డోర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు డోర్ డ్యామేజ్ అయ్యింది. అయితే ఆ మహిళ తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
బెంగళూరు: రద్దీ రోడ్డులో ఆగిన క్యాబ్ డోర్‌ను ఒక మహిళ అకస్మాత్తుగా తెరిచింది. (Woman Abruptly Opened Cab Door) ఆ కారు నుంచి ఆమె దిగింది. ఇంతలో ఒక ఆటో ఆ క్యాబ్ డోర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు డోర్ డ్యామేజ్ అయ్యింది. అయితే ఆ మహిళ తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై ఒక క్యాబ్ ఆగింది. ఇతర వాహనాల రాకపోకలను పట్టించుకోని మహిళ అకస్మాత్తుగా క్యాబ్ డోర్ తెరిచింది. ఇంతలో వేగంగా వచ్చిన ఒక ఆటో ఆ కారు డోర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ కారు డోర్ డ్యామేజ్ అయ్యింది.
కాగా, క్యాబ్ నుంచి దిగిన ఆ మహిళ దీని గురించి పట్టించుకోలేదు. డ్యామేజ్ అయిన కారు డోర్‌ను మూసేందుకు ప్రయత్నించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆటో ఆపిన డ్రైవర్ ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటోకు ఏదైనా డ్యామేజ్ జరిగిందా అని చూసుకున్నాడు. ఇంతలో ఆ క్యాబ్ ముందుకు వెళ్లింది. అయితే డోర్ డ్యామేజ్ కావడాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా ఆపాడు.
మరోవైపు ఒక వాహనం డ్యాష్‌బోర్డ్‌పై ఉన్న కెమెరాలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రోడ్డుపై వాహనం డోర్ తెరిచేటప్పుడు జాగ్రత్త వహించాలని కొందరు సూచించారు. రోడ్డు మధ్యలో ఆపిన క్యాబ్ డ్రైవర్‌తోపాటు చూసుకోకుండా డోర్ తెరిచిన ఆ మహిళది కూడా తప్పని మరికొందరు విమర్శించారు. ఆ మహిళ వల్ల క్యాబ్ డ్రైవర్‌కు నష్టం వాటిల్లిందని కొందరు సానుభూతి వ్యక్తం చేశారు.
Passenger on a cab opens car 🚗 door in the middle of the road, causing an auto 🛺 to ram into it. Despite the collision, she calmly walks away as if nothing happened. This was caught on dashcam footage 📷 #Dashcam #RoadSafety pic.twitter.com/dGzSU4lOAS
— ThirdEye (@3rdEyeDude) February 8, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

