బెంగళూరు: యువ జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడి తల్లి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను స్తంభానికి కట్టేసి కొట్టారు. (woman tied to pole thrashed) కర్నాటకలోని హవేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అరెమల్లాపుర గ్రామానికి చెందిన మంజునాథ్, పూజ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ నెల 29న వారిద్దరూ కలిసి తమ ఇళ్ల నుంచి పారిపోయారు.
కాగా, ఈ విషయం తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. మంజునాథ్ ఇంటికి వచ్చి హంగామా చేశారు. 50 ఏళ్ల అతడి తల్లి హనుమవ్వ కోమ్‌ను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకు వచ్చారు. ఆమెను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు.
మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. హనుమవ్వను కాపాడారు. ఆమె ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతి కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A woman from #Aremallapur village of #Ranebennur taluk, #Haveri district, #Karnataka was tied to an electricity pole and thrashed by an angry mob after her son eloped with a girl. The incident took place four days ago, but came to light only now.
The victim is 50-year-old… pic.twitter.com/bHfxuiSxdE
— Hate Detector 🔍 (@HateDetectors) May 3, 2024