Battle Of Galwan | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan). వార్ డ్రామా వస్తోన్న ఈ సినిమాకు అపూర్వ లాఖియా దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ చిత్రాంగద సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.
భారతదేశం-చైనా సరిహద్దులో 2020లో జరిగిన గల్వాన్ లోయ సంఘటన ఆధారంగా ఈ మూవీ వస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ టీజర్‌ను డిసెంబర్ 27న లాంచ్ చేయనున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
ఈ మూవీలో సల్మాన్ ఖాన్ తెలంగాణకు చెందిన వీర సైనికుడు, గల్వాన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపించబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. కాగా దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ కాంబోలో వస్తోన్న తొలి సినిమా ఇది.
Mysaa | అగ్రెసివ్‌గా రష్మిక మందన్నా.. మైసా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేస్తుంది
Bala Krishna | నార్త్ మార్కెట్లో ఆశలు నెరవేరవా.. బాలకృష్ణకి కూడా నిరాశే ఎదురైందా?