Director Surya | మహతి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. సూర్య దర్శకుడు. సాయికుమార్, వినయ్, అరుణ్, దీప్తివర్మ తదితరులు నటించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘రాజకీయ వ్యంగ్యాత్మక కథాంశమిది. నేటి ఎన్నికల రాజకీయాలపై సెటైరికల్‌గా ఉంటుంది.
ఓటర్లే వారి ఓటుకు ఒక రేటు ఫిక్స్ చేసుకొని నాయకులను ముప్పుతిప్పలు పెడితే ఎలా ఉంటుందనే పాయింట్‌తో తెరకెక్కించాం. వినోదంతో పాటు అంతర్లీనంగా సందేశం ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాని ఐనవెల్లి, సంగీతం: అభిషేక్, నిర్మాతలు: యు.శ్రీనివాసులు రెడ్డి, బి.నాగేశ్వర్ రెడ్డి, వహీద్ షేక్, కే.పురుషోత్తం రెడ్డి, రచన-దర్శకత్వం: సూర్య.