న్యూఢిల్లీ, నవంబర్ 2: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు మొదలైనవి సభ ముందుకు రాబోతున్నట్టు తెలిపాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింపజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. గురుగావ్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు విపక్షాలు జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు-2024ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో విపక్షాలు, అధికార ఎన్డీయే కూటమి సభ్యుల మధ్య పార్లమెంట్లో వాడి వేడి చర్చ సాగనున్నట్టు తెలుస్తున్నది.