న్యూఢిల్లీ: ఒకవేళ దేశ ప్రజలు కోరుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై చట్టాలను రూపొందిస్తామని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) తెలిపారు. ఇవాళ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అకోలాకు చెందిన బీజేపీ ఎంపీ అనుప్ ధోత్రి ఆ ప్రశ్న వేశారు. కీలక రంగాల్లో ఏఐ డెవలప్మెంట్ గురించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వెల్లడించాలని ఆయన కోరారు. ఆ ప్రశ్నకు సమాధానంగా కావాలంటే ఏఐ చట్టాలను తీసుకువస్తామని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడుతూ.. టెక్నాలజ అంటే పేద ప్రజలు వాడేది కాదు అన్నట్లు కాంగ్రెస్ వ్యవహరించిందని మంత్రి పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ కోసం 8.6 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా టెక్నాలజీని ప్రజాస్వామ్య పరచడమే ప్రధాని మోదీ ఉద్దేశమని మంత్రి వైష్ణవ్ చెప్పారు.
Union Minister #AshwiniVaishnaw Clarity on #AI Skills and Jobs pic.twitter.com/07HJyxdsLy
— India Brains (@indiabrains) December 11, 2024