న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో కొన్ని దేశాల్లో సంభవించిన ప్రకృతి విపత్తులు తీరని నష్టాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో సంభవించిన కార్చిచ్చులు, వడగాల్పులు, కరువు, తుఫాన్ల వల్ల దాదాపు 120 బిలియన్ డాలర్ల (రూ.10.77లక్షల కోట్లు)పైగా నష్టం వాటిల్లినట్టు బ్రిటన్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.
వీటిలో అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల తీవ్ర నష్టం కలిగినట్టు పేర్కొన్నది. ఈ కార్చిచ్చు వల్ల దాదాపు 60 బిలియన్ డాలర్ల నష్టం జరగడంతోపాటు దాదాపు 400 మందికి పైగా మృత్యువాత పడినట్టు తెలిపింది.