Rahul Gandhi | పార్లమెంట్ (Parliament) కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఫ్లయింగ్ కిస్ (Flying Kiss) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన అనంతరం వెళ్తూ వెళ్తూ బీజేపీ మహిళా ఎంపీల బెంచ్‌ల వైపు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani ) ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో సభలోని మహిళా ఎంపీలు రాహుల్ పై ఆగ్రహానికి గురయ్యారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, ఫ్లైయింగ్ కిస్ వ్యవహారంపై ఓ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే తాజాగా చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారి తీసేలా ఉన్నాయి.
బీహార్‌లోని హిసువా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ (Neetu Singh) మాట్లాడుతూ.. తమ నాయకుడు రాహుల్ గాంధీకి అమ్మాయిల కొరత లేదని, అలాంటిది 50 ఏళ్ల వృద్ధురాలికి ఫ్లైయింగ్ కిస్ ఎందుకు ఇస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మా నాయకుడు రాహుల్ గాంధీకి అమ్మాయిల కొరత లేదు. ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే అమ్మాయికి ఇస్తారు. కానీ 50 ఏళ్ల వృద్ధురాలికి ఎందుకు ఇస్తారు..? రాహుల్ గాంధీపై ఈ ఆరోపణలు నిరాధారమైనవి’ అని నీతూ సింగ్ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఆమె కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని 50 ఏళ్ల వృద్ధురాలు అని పరోక్షంగా అన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఫ్లైయింగ్ కిస్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు నేతలు రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన (యూబీటీ) పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi ) కూడా రాహుల్ కు మద్దతుగా నిలిచారు. రాహుల్ ఫ్లయింగ్ కిస్‌లో తప్పేమీ లేదని.. ఆయన ఆప్యాయంగా ‘సంజ్ఞ’ చేశారన్నారు.
If Rahul Gandhi wants to give flying kiss he has many women available
He won’t give it to a 50 year old budhiya
Congress MLA from Bihar : Neetu Singh
Anti women Congress can even defend Rahul’s misdemeanours inside the House pic.twitter.com/oXRz67ZqlX
— Shehzad Jai Hind (@Shehzad_Ind) August 10, 2023
Also Read..
Virat Kohli | ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ ఒక్కో పోస్ట్‌కు ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా..?
Russia | జాబిల్లిపైకి విజయవంతంగా దూసుకెళ్లిన రష్యా లునా-25.. చంద్రయాన్-3 కంటే ముందే ల్యాండింగ్