జడ్చర్ల(రాజాపూర్), జనవరి 5 : జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండలం నాన్చెరుతండాకు చెందిన సర్పంచ్ వెంకట్నాయక్ సోమవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకట్నాయక్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు.
హైదరాబాద్లోని లక్ష్మారెడ్డి నివాసంలో వెంకట్నాయక్ బీఆర్ఎస్లో చేర గా ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు ఉన్నారు.