ICC : పంతానికి పోయి టీ20 వరల్డ్‌కప్ అవకాశాన్ని చేజార్చుకున్న బంగ్లాదేశ్‌కు ఐసీసీ మరో షాకిచ్చింది. ప్రపంచకప్ మ్యాచ్‌ల కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న ఆ దేశానికి చెందిన క్రీడా జర్నలిస్టులకు అనుమతి నిరాకరించింది. దాదాపు వందకుపైగా అప్లికేషన్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తిరస్కరించింది దాంతో.. తమ బోర్డు చేసిన తప్పిదానికి మమల్ని శిక్షించవద్దని వారు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియా అక్రిడిటేషన్స్ జారీని మరోసారి పరిశీలిస్తామని ఐసీసీ వెల్లడించింది.
భారత్‌లో వరల్డ్‌కప్ కోసం తమ జట్టును పంపబోమని బెట్టుచేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. భద్రతా కారణాలను సాకుగా చూపి మేము ఆడమంటే ఆడమని పంతం పట్టినందుకు బంగ్లాదేశ్‌ను తప్పించిన స్కాంట్లాండ్‌కు అవకాశమిచ్చింది ఐసీసీ. ఇప్పుడు వరల్డ్‌కప్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న క్రీడా జర్నలిస్ట్‌లకు అనుమితివ్వలేదు ఐసీసీ. ఈ విషయంపై బంగ్లా బోర్డు మీడియా అధ్యక్షుడు హంజద్ హొసేన్ తిరస్కరణకు కారణాలు తెలపాలని ఐసీసీని కోరాడు.
ICC Rejected Accreditation Applications of Bangladeshi Journalists, After Bangladesh’s Exclusion from the T20 World Cup… pic.twitter.com/zmNqXKlXpM
— Sportsmail24.com (@sportsmail24) January 26, 2026
‘మా దేశ క్రీడా జర్నలిస్ట్‌ల దరఖాస్తులను తిరస్కరించారనే విషయం సోమవారం తెలిసింది. అందుకు కారణం తెలపాలని ఐసీసీని కోరాం. ఇది అంతర్గత వ్యవహారం. అయితే.. ఐసీసీ ఎందుకు మావాళ్లకు అనుమతి ఇవ్వలేదో తెలుసుకోవాలనుకుంటున్నాం’ అని ఆయన పేర్కొన్నాడు. ఇక వరల్డ్‌కప్ కవరేజీ కూడా అసాధ్యమేనా? అనుకుంటున్న బంగ్లాదేశ్ జర్నలిస్ట్‌లకు ఊరటనిస్తూ అక్రిడిటేషన్ జారీ ప్రక్రియపై మరోసారి దృష్టి సారిస్తున్నామని ఐసీసీ తెలిపింది.
‘దేశం ప్రాతిపదికన చూసినా ఒక్కో దేశానికి చెందిన జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్స్ 40కి మించవు. వరల్డ్‌కప్ ఆతిథ్య బోర్డుల సూచనల ప్రకారం అక్రిడిటేషన్ దరఖాస్తులకు అనుమతినిస్తుంది. ఈసారి మెగా టోర్నీని కవర్ చేసేందుకు భారీగా జర్నలిస్ట్‌లు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో.. అక్రిడిటేషన్ పాసుల జారీ ప్రక్రియను మరోసారి పరిశీలిస్తున్నాం. అర్హత, నిబంధనలను బట్టి అక్రిడిటేషన్ జాబితాను సిద్ధం చేస్తాం’ అని మంగళవారం ఐసీసీ వర్గాలు తెలిపాయి.
ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్‌ను తొలగించడంపై ఆగ్రహించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందని చెప్పి.. భారత్‌లో ఆడబోమని భీష్మించుకుంది. శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్ మార్చాలని, గ్రూప్ స్వాపింగ్ చేయాలని ఐసీసీకి లేఖ రాసింది. కానీ, ఐపీఎల్‌తో వరల్డ్‌కప్ ఈవెంట్‌కు ముడిపెట్టి షెడ్యూల్ మార్చాలనే బంగ్లా బోర్డు అభ్యర్థనను జై షా నేతృత్వంలోని బృందం తిరస్కరించింది. నిర్ణయం మార్చుకోకుంటే స్కాట్లాండ్కు అవకాశమిస్తామని బీసీబీని హెచ్చరించింది. అయినా మాట వినకపోవడంతో ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు గ్రూప్ సీలో చోటు కల్పించింది.
Introducing your Scotland squad heading to the ICC Men’s #T20WorldCup in India and Sri Lanka 🤩
➡️ https://t.co/cmtJB52phQ pic.twitter.com/2EQgZb5CdH
— Cricket Scotland (@CricketScotland) January 26, 2026