Virat Kohli | ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ ఒక్కో పోస్ట్‌కు ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా..?
Virat Kohli | టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి సోషల్ మీడియా (Social Media)లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ ఒకడు. ఈ క్రమంలో ఇన్‌స్టా ద్వారా కోహ్లీ భారీగానే ఆదాయం పొందుతున్నాడు. ప్రతి స్పాన్సర్డ్ పోస్ట్‌కి కోహ్లీ రూ.కోట్లల్లో ఛార్జ్ చేస్తున్నాడు.
Virat Kohli | టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి తెలియని వారు ఉండరు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. టీమిండియా (Team India)లో టాప్ బ్యాటర్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కింగ్ కోహ్లీనే. కేవలం ఆట పరంగానే కాదు సంపాదనలోనూ అతను కింగే. క్రికెట్ ద్వారానే కాకుండా యాడ్స్, ఇతర బిజినెస్‌ల ద్వారా కోహ్లీ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా కూడా భారీగానే ఆదాయాన్ని అర్జిస్తున్నాడు.
విరాట్ కోహ్లీకి సోషల్ మీడియా (Social Media)లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ ఒకడు. ఇన్స్టాగ్రామ్ (Instagram)లో కోహ్లీకి ఏకంగా 256 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టా ద్వారా కోహ్లీ భారీగానే ఆదాయం పొందుతున్నాడు. ప్రతి స్పాన్సర్డ్ పోస్ట్‌కి కోహ్లీ రూ.కోట్లల్లో ఛార్జ్ చేస్తున్నాడు.
2023లో ప్రముఖ ఫొటో, వీడియో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 20 స్టార్స్ జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అగ్రస్థానంలో నిలిచాడు. అతను ఒక్కో స్పాన్సర్డ్ పోస్ట్‌కు 3.23 మిలియన్ల (USD) భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నాడు. అంటే ఇది దాదాపుగా రూ.26.75 కోట్లకు సమానం. ఇక రొనాల్డో తర్వాత లియోనెల్ మెస్సీ (Lionel Messi) తర్వాతి స్థానంలో నిలిచాడు. అతడు ఒక్కో ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు 2.56 మిలియన్లు (USD) వసూలు చేస్తున్నాడు. అంటే రూ.21.49 కోట్లన్నమాట.
ఇక ఈ జాబితాలో కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కు 1.38 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నట్లు తేలింది. అంటే ఒక్కో పోస్ట్‌కు కోహ్లీ సంపాదన రూ.11.45 కోట్లన్న మాట. భారత్ నుంచి కోహ్లీకి ఒక్కడికే ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం.

Also Read..
Russia | జాబిల్లిపైకి విజయవంతంగా దూసుకెళ్లిన రష్యా లునా-25.. చంద్రయాన్-3 కంటే ముందే ల్యాండింగ్
Actor Vishal | లక్ష్మీ మీనన్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

