గుమ్మడిదల, జనవరి 5: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డుల్లో మెజార్టీ స్థానాలు గెలుపొంది బల్దియా కార్యాలయంపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం, దోమడుగు, బొంతపల్లి, వీరన్నగూడెం వార్డుల్లో బీఆర్ఎస్ బలంగా ఉందని గుర్తుచేశారు. అధికార పార్టీకి దీటుగా ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలుపొందారని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుపొంది బీఆర్ఎస్ సత్తాచాటుతామన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లు రాగానే అభ్యర్థులను ఎంపికచేస్తామన్నారు.
బీఆర్ఎస్తోనే గుమ్మడిదల మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమన్నారు. మున్సిపల్ ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, సీనియర్ నాయకులు సద్దివిజయభాస్కర్రెడ్డి, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్, మురళి, నరహరి, రుక్మారెడ్డి, సంజీవరెడ్డి, చిమ్ముల నరేందర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.