లక్నో: ప్రతిపక్షాలకు చెందిన నాయకులను వేధించడానికే కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను (ED) వాడుకుంటున్నదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆరోపించారు. మరి బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఈడీ ఎందుకు బయటకు తీయడంలేదని ప్రశ్నించారు. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు అవినీతికి వేదికగా మారిదన్నారు.
బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును ప్రధాని మోదీ ఈనెల 16న ప్రారంభించారు. అయితే భారీ వర్షాలకు నాలుగు రోజుల్లోనే కొట్టుకుపోయిందని చెప్పారు. ఈ వ్యవహారంపై ఈడీ ఎందుకు విచారణ జరపడంలేదన్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధించడానికి కేంద్రప్రభుత్వానికి ఒక ఆయుధంగా ఈడీ మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.