Corona Vaccine : ఒక్క రోజే కోటి డోసులు : డబ్ల్యూహెచ్ఓ అభినందన
Corona Vaccine : శుక్రవారం ఒక్క రోజులోనే కోటి డోసులు వేశారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యాస్వామినాథన్ భారతదేశానికి అభినందనలు తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు...

న్యూఢిల్లీ : భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccine) ప్రక్రియ చురుకుగా సాగుతున్నది. యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేపడుతుండగా.. శుక్రవారం ఒక్క రోజులోనే కోటి డోసులు వేశారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యాస్వామినాథన్ భారతదేశానికి అభినందనలు తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు 60.4 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా, 13.6 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇలా ఉండగా, కరోనా మార్గదర్శకాలను వచ్చే నెల 30 వరకు కేంద్రం పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
భారత్‌లో ఒక్క రోజులోనే కోటి మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం పట్ల సౌమ్యాస్వామినాథన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆమె భారతదేశం ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ‘వయోజన జనాభాలో 50 శాతం మందికి భారతదేశం టీకా (కనీసం ఒక మోతాదు) ఇచ్చింది. ఇప్పటివరకు మొత్తం 62 కోట్ల డోస్‌లు ఇచ్చారు. అందులో శుక్రవారం కోటి డోస్‌లు ఇవ్వడం నిజంగా అభినందనీయం. ఈ ప్రచారంలో పాల్గొన్న వెయ్యి మందికి పైగా కార్యకర్తలకు అభినందనలు. వ్యాక్సిన్‌తో కరోనా నుంచి ప్రజారోగ్యం, నివారణ పద్ధతులను అనుసరించడం ద్వారా మనమందరం సురక్షితంగా ఉందాం’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పూర్తి టీకాల లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశానికి డిసెంబర్ 31 లోపు ప్రతిరోజూ 1 కోటి వ్యాక్సిన్ మోతాదులను ఇంజెక్ట్ చేయాలని టీకాపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ అధిపతి డాక్టర్ ఎన్‌కె అరోరా తెలిపారు.
ఇది పెద్ద విజయం : నరేంద్ర మోదీ
దేశానికి ఇది పెద్ద విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘టీకా రికార్డు సృష్టించబడింది. ఒక కోటి మార్కును దాటడం పెద్ద విజయం. టీకా వేసిన వారందరికీ, టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ అభినందనలు’ అని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అసోంలో మళ్లీ హింసాకాండ : ఐదుగురు డ్రైవర్లు సజీవ దహనం
చారిత్రాత్మకంగా నిలిచిన ప్రిన్సెస్ డయనా విడాకులు
రాణె తల నరికి తెస్తే 51 లక్షల రివార్డ్ : విశ్వ హిందూ సేన
7,200 ఏండ్ల క్రితం మహిళ శరీరంలో డీఎన్ఏ గుర్తింపు
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
Ramayana Movie | ఆస్కార్ బరిలో ‘రామాయణ’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

