Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
Priya Bhavani Shankar | తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న తన ప్రియుడు రాజ్వెల్ రాజ్‌ను ఆమె వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కాలేజీ రోజుల నుంచి కొనసాగుతున్న వీరి ప్రేమ ప్రయాణం ఎట్టకేలకు పెళ్లి బంధంతో మరో మెట్టు ఎక్కింది.
Priya Bhavani Shankar | తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న తన ప్రియుడు రాజ్వెల్ రాజ్‌ను ఆమె వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కాలేజీ రోజుల నుంచి కొనసాగుతున్న వీరి ప్రేమ ప్రయాణం ఎట్టకేలకు పెళ్లి బంధంతో మరో మెట్టు ఎక్కింది. దీంతో ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం ‘ఇరుముడి’తో ప్రియా భవానీ శంకర్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ అందుకున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన భార్య పాత్రలో కనిపించిన ఆమె, తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కథలో కీలకమైన పాత్రలో నటిస్తూ తన అభినయంతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు సంపాదించుకున్న ప్రియా.. ఇప్పుడు తన పెళ్లి వార్తతో మరోసారి వార్తల్లో నిలిచారు.ప్రియా భవానీ శంకర్, రాజ్వెల్ రాజ్‌ల పరిచయం కాలేజీ రోజుల నుంచే ప్రారంభమైంది. అప్పటి నుంచి స్నేహంగా మొదలైన వీరి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ బంధాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచలేదు. సోషల్ మీడియా వేదికగా కూడా తమ ప్రేమను పలుమార్లు వ్యక్తపరిచారు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో అండగా నిలిచారు. తమ పెళ్లి గురించి గతంలోనే ప్రియా భవానీ శంకర్ పలు సందర్భాల్లో స్పందించారు. 2024లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజ్వెల్తో త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. అప్పటి నుంచి ఈ జంట పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తమ సుదీర్ఘ ప్రేమ ప్రయాణానికి పెళ్లితో ముగింపు పలుకుతూ కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పెళ్లి తర్వాత ప్రియా భవాని శంకర్ భర్తతో కలిసి క్యూట్ ఫొటో షూట్ చేసింది. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. జంట చూడముచ్చటగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇక తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియా భవాని శంకర్ , విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటిగా తన పరిధిని విస్తరించుకుంటున్నారు. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘డిమోంటి కాలనీ’ సిరీస్‌లో ఆమె భాగమవడం విశేషం. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న ‘డిమోంటి కాలనీ 3’ చిత్రంలోనూ ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
Ramayana Movie | ఆస్కార్ బరిలో ‘రామాయణ’
Kavya Maran | వివాహ బంధంలో అడుగుపెట్టిన అనిరుధ్ కావ్య మారన్..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

