Princess Diana : చారిత్రాత్మకంగా నిలిచిన ప్రిన్సెస్ డయనా విడాకులు
Princess Diana : ప్రిన్స్ చార్లెస్‌తో వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రిన్సెస్ డయానా ప్రకటించి యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ప్రిన్స్ చార్లెస్‌తో ఆమె వివాహం ఎంత చారిత్రాత్మకంగా నిలిచిందో.. అంతే మాదిరిగా,,,

ప్రిన్స్ చార్లెస్‌తో వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రిన్సెస్ డయానా (Princess Diana) ప్రకటించి యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ప్రిన్స్ చార్లెస్‌తో ఆమె వివాహం ఎంత చారిత్రాత్మకంగా నిలిచిందో.. అంతే మాదిరిగా ఆమె విడాకులు, మరణం కూడా నిలిచిపోయాయి. ప్రిన్స్ చార్లెస్ నుంచి డయానా 1996 లో సరిగ్గా ఇదే రోజున విడాకులు తీసుకున్నారు. అనంతరం సరిగ్గా ఏడాదికి పారిస్‌లో ఒక కారు ప్రమాదంలో ఆమె విగతజీవిగా మారారు.
డయానా బ్రిటీష్‌లోని స్పెన్సర్ కుటుంబానికి చెందిన ఎడ్వర్డ్ జాన్ స్పెన్సర్, ఫ్రాన్సిస్ రూత్ రోచేల నాలుగో సంతానంతా 1961 జూలై 1 న ఇంగ్లండ్‌లో జన్మించింది. స్పెన్సర్ కుటుంబానికి, బ్రిటీష్ రాజకుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. డయానా నాయనమ్మ, అమ్మమ్మలు బ్రిటీష్ మహారాణి ఎలిజెబెత్-1 వద్ద సహచరులుగా పనిచేశారు. 1977 లో ఆమె ప్రిన్స్ చార్లెస్‌ను చూసింది. అప్పుడామె వయసు 16 సంవత్సరాలు. ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగింది. మూడేండ్ల తర్వాత ఆమెను స్కాటిష్ భవనానికి తీసుకెళ్లి ఎలిజెబెత్ మహారాణికి, తండ్రి ఫిలిఫ్కు పరిచయం చేశాడు. చివరకు 1981 జూలై 29 న లండన్‌లోని సెయింట్ పాల్ కాతెడ్రాల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీలు జన్మించారు.
కెమిల్లా పార్కర్‌తో ప్రిన్స్ చార్లెస్‌కు సంబంధాలు బయటకు రావడంతో.. ప్రిన్సెస్ డయానా చార్లెస్‌ను దూరం పెడుతూ వచ్చింది. చార్లెస్‌తో విడాకులు తీసుకునేందుకు డయానా ససేమిరా అన్నప్పటికీ.. ఆమెను బలవంతంగా ఒప్పించారు. వీరి విడాకులు తీసుకుంటున్న విషయాన్ని అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి జాన్ మేజర్ 1992 డిసెంబర్ 9 న ప్రకటించారు. చివరకు 1996 లో వీరు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. దీని తర్వాత లండన్‌లో జరిగిన ఒక కారు ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలయ్యారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2017: బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు
1973: 90,000 పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను విడుదల చేయడానికి భారతదేశం-పాకిస్తాన్ ఒప్పందం
1963 : చారిత్రక ప్రసంగం చేసిన మార్టిన్ లూథర్ కింగ్
1845: సైన్స్ జర్నల్ సైంటిఫిక్ అమెరికన్ తొలి ప్రచురణ
1789: చంద్రుడిని కనుగొన్న సర్ విలియం హెర్షెల్
ఇవి కూడా చదవండి..
రాణె తల నరికి తెస్తే 51 లక్షల రివార్డ్ : విశ్వ హిందూ సేన
7,200 ఏండ్ల క్రితం మహిళ శరీరంలో డీఎన్ఏ గుర్తింపు
జైలులో కొత్త రకం శిక్ష వేశారు : అలెక్సీ నవాల్నీ
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

