ఆస్కార్ బరిలో ‘రామాయణ’
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన భారతీయ పురాణేతిహాస గాథ ‘రామాయణ’కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారు.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన భారతీయ పురాణేతిహాస గాథ ‘రామాయణ’కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారు. సీతారాముల పాత్రల్లో సాయిపల్లవి, రణబీర్‌కపూర్ నటించిన ఈ చిత్రానికి నితేష్ తివారి దర్శకత్వం వహించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డుల పరిశీలనకు పంపించినట్లు వార్తలొస్తున్నాయి. 99వ ఆస్కార్ పురస్కారాల కోసం భారతదేశం తరపున ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో మరాఠీ చిత్రం ‘గోంధల్’ అధికారికంగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఇతర భారతీయ చిత్రాలు కూడా ఆస్కార్ మిగతా విభాగాల్లో పోటీపడేందుకు అవకాశం ఉంటుంది.
అకాడమీ నిర్ధేశించిన ప్రమాణాలను అందుకుంటే విదేశీ చిత్రాలను స్వతంత్ర పరిశీలనకు పంపించవొచ్చు. ఈ నేపథ్యంలో ‘రామాయణ’ చిత్రాన్ని విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ పరిశీలనకు పంపినట్లు సమాచారం. ‘గోంధల్’తో పాటు నాగాలాండ్ నేపథ్య కథాంశంతో రూపొందిన ‘అంఘ్’ చిత్రం సైతం ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అకాడమీ పరిశీలనకు ఎంపికయ్యే అర్హతను సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ‘రామాయణ’ చిత్రం కూడా ఆస్కార్ బరిలో అర్హత సాధించేందుకు పోటీలో నిలవడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

