స్వచ్ఛ సర్వేక్షణ్‌లో బల్దియాకు జాతీయ అవార్డు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) జాతీయ అవార్డును అందుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రత్యేకాధికారి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌లు ఈ అవార్డును స్వీకరించారు.
సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ) : స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) జాతీయ అవార్డును అందుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రత్యేకాధికారి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌లు ఈ అవార్డును స్వీకరించారు.
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ఈ గుర్తింపు లభించింది. నగరంలో పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ఘన వ్యర్థాల శుద్ధి, మురుగునీటి నిర్వహణ, పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం తదితర పది ప్రధాన అంశాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనంలో జీహెచ్ఎంసీ తన పనితీరును ప్రదర్శించింది. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2017లో హైదరాబాద్ ఓడీఎఫ్ హోదా సాధించగా, 2019లో ఓడీఎఫ్++ గుర్తింపు పొందింది. 2021లో తెలంగాణలోనే తొలిసారిగా వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ పొందిన స్థానిక సంస్థగా జీహెచ్ఎంసీ నిలిచింది. 2023, 2024లోనూ ఈ హోదాను కొనసాగించింది. 2024 స్వచ్ఛ సర్వేక్షణ్ లో 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో ఆరో ర్యాంకు సాధించింది. అలాగే 2023లో 5 స్టార్, 2024లో 7 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ గుర్తింపులు పొందింది. తాజాగా తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా జీహెచ్ఎంసీకి గుర్తింపు లభించింది.
10,500 మారులతో మూల్యాంకనం
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో మొత్తం 10,500 మారులతో పది ప్రధాన విభాగాల్లో నగరాల పనితీరును అంచనా వేశారు. కనిపించే పారిశుధ్యం, చెత్త వేరు చేయడం, సేకరణ, రవాణా, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య సదుపాయాలు, వినియోగించిన నీటి నిర్వహణ, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, పౌరుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కాగా, స్వచ్ఛ షెహర్ జోడీ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ మెంటార్ సిటీగా వ్యవహరిస్తూ మంథని, చేర్యాల మున్సిపాలిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఆయా పట్టణాల్లో పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు శిక్షణ కార్యక్రమాలు, సామర్థ్య పెంపు వర్ షాప్ లు నిర్వహించింది.
2026 ఏప్రిల్, మే నెలల్లో హైదరాబాద్ జంట నగరాల్లో మూడో పక్షం ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. పారిశుధ్య మౌలిక సదుపాయాలు, చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఇంటింటి చెత్త సేకరణతో పాటు ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. జీహెచ్ఎంసీకి జాతీయ అవార్డు లభించడం నగర ప్రజలు, అధికారులు, పారిశుధ్య కార్మికులకు గర్వకారణమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ఈ గుర్తింపు హైదరాబాద్‌ను మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

