ప్రతి ఫైలుకో రేట్ ఫిక్స్!
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అవినీతికి కేరాఫ్‌గా మారింది. వరుస అవినీతి ఉదంతాలు వెలుగుచూస్తున్నా కొందరు అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. ఉన్నతాధికారుల అండతో వసూళ్ల దందాకు తెగబడుతున్నారు. రాష్ట్ర ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) విభాగాన్ని ఇద్దరు అడిషనల్ డైరెక్టర్లు(ఏడీ) వారి గుప్పిట్లోకి తీసుకుని అవినీతి దందాను దర్జాగా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- డీహెచ్‌లో వసూల్ రాజాలు
- ఇద్దరు ఏడీల చేతుల్లోకి విభాగం
- ఫైలుకు రూ.2-3 లక్షలు డిమాండ్
- ఎదురు తిరిగితే మారుమూల ప్రాంతాలకు పోస్టింగ్
- విజిలెన్స్ విచారణ జరిపించాలని ఉద్యోగుల డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అవినీతికి కేరాఫ్‌గా మారింది. వరుస అవినీతి ఉదంతాలు వెలుగుచూస్తున్నా కొందరు అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. ఉన్నతాధికారుల అండతో వసూళ్ల దందాకు తెగబడుతున్నారు. రాష్ట్ర ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) విభాగాన్ని ఇద్దరు అడిషనల్ డైరెక్టర్లు(ఏడీ) వారి గుప్పిట్లోకి తీసుకుని అవినీతి దందాను దర్జాగా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతి ఫైలుకూ ఓ రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. డిప్యుటేషన్లు, సరెండర్ కేసులు, ఫారెన్ సర్వీస్ డిప్యుటేషన్లు(ఎఫ్‌ఎస్‌డీలు), విజిలెన్స్ ఫైళ్ల క్లియరెన్స్‌కు భారీగా వసూలు చేస్తున్నట్టు సొంతశాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ఒక్కో ఫైలుకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ.. తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్టు తెలిసింది. తమకు లొంగకుండా ఎదురు తిరిగిన వారిని ఉద్దేశపూర్వకంగా మారుమూల ప్రాంతాలకు పోస్టింగ్ ఇస్తున్నట్టు సమాచారం.
45 సరెండర్ కేసుల్లో ఇదే తంతు
డీహెచ్ విభాగంలోని కీలకాధికారిని తమ గుప్పిట్లో ఉంచుకుని ఈ దందాను ఇద్దరు అధికారులు కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీహెచ్ కార్యాలయంలో వరుస అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీఎంవో అధికారులు ఇటీవల విచారణ జరిపారు. విచారణలో 45 సరెండర్ కేసులు గుర్తించారు. ఆ మొత్తం సరెండర్ కేసుల్లో ఈ ఇద్దరు అధికారులే చక్రం తిప్పినట్టు తెలిసింది. ఈ సరెండర్ కేసుల వెనుక సైతం పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉన్నతాధికారుల అండ చూసుకునే ఈ అవినీతి తంతును నడుపుతున్నట్టు ఆరోపణలున్నాయి. వసూళ్ల దందాలో ఉన్నతాధికారులకు సైతం వాటాలు ఇస్తూ తమ దందాను దర్జాగా కొనసాగిస్తున్నారని సమాచారం. ఇద్దరు అధికారుల కారణంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం భ్రష్టు పట్టిందని కొంతమంది ఉద్యోగులు బాహాటంగానే చెప్తుండడం గమనార్హం. కిందిస్థాయి అధికారుల నుంచి పైస్థాయి వరకు అంతా ఓ చైన్ సిస్టంగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇద్దరు అవినీతి అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

