నోయిడా మెట్రో విస్తరణకు గ్రీన్‌సిగ్నల్
నోయిడా సెక్టార్ 51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్ 4 వరకు ఆక్వా లైన్ మెట్రో రైలు కారిడార్ విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.2,390 కోట్ల అంచనా వ్యయంతో 8.449 కి.మీ. పొడవున ఐదు ఎలివేటెడ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో మెట్రో రైలు నెట్వర్క్ మొత్తం 71.878 కి.మీ.కు చేరనున్నది.
న్యూఢిల్లీ: నోయిడా సెక్టార్ 51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్ 4 వరకు ఆక్వా లైన్ మెట్రో రైలు కారిడార్ విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.2,390 కోట్ల అంచనా వ్యయంతో 8.449 కి.మీ. పొడవున ఐదు ఎలివేటెడ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో మెట్రో రైలు నెట్వర్క్ మొత్తం 71.878 కి.మీ.కు చేరనున్నది.
ఎరువుల సబ్సిడీకి 62 వేల కోట్లు
రబీ సీజన్ 2026-27కు ఫాస్ఫేటిక్, పొటాసిక్ ఎరువులపై రూ.62,370 కోట్ల సబ్సిడీకి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 2026 అక్టోబర్ నుంచి 2027 మార్చి 31 వరకు ఉండే రబీ సీజన్ కోసం పీ అండ్ కే ఎరువులపై సబ్సిడీ రేట్లను ఖరారు చేశామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రేట్లు పెరిగాయన్నారు. 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350గానే కొనసాగుతుందని, రైతులకు ఇబ్బంది లేకుండా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, సల్ఫర్ లను గ్రేడ్లతో సహా సబ్సిడీ రేట్లకే అందిస్తామన్నారు.
రూ.3,230 కోట్లతో ఢిల్లీలో యుగే యుగీన్ మ్యూజియం
ఢిల్లీలోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ సముదాయాలను పునర్వినియోగంలోకి తీసుకొచ్చి యుగే యుగీన్ భారత్ మ్యూజియం ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీని కోసం రూ.3,230 కోట్లను కేటాయించడానికి ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక ప్రదర్శన స్థలం కలిగిన మ్యూజియంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. సుమారు 1,78,509 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మ్యూజియం నిర్మించనున్నారు.
‘స్టాండప్ ఇండియా’ గడువు ఐదేండ్ల పొడిగింపు
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే స్టాండప్ ఇండియా పథకాన్ని మరో ఐదేండ్లు (2031 మార్చి 31 వరకు) కొనసాగించేందుకు క్యాబినెట్ ఆమోదించింది. మరో 2.5 లక్షల మంది పారిశ్రామికవేత్తలకు ఐదేండ్లలో ఆర్థిక సాయం అందించడమే పథకం లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం ద్వారా 2.75 లక్షల మందికిపైగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణాలు అందాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

