ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
శ్రీ కోట మైసమ్మ ఆలయ ప్రాంగణంలోని జామ తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బుధవారం రాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు.
కారేపల్లి,నవంబర్ 11: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి శ్రీ కోట మైసమ్మ ఆలయ ప్రాంగణంలోని జామ తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బుధవారం రాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక ఎస్సై వి. రమేష్ బ్లూకోల్ట్స్, పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని గుర్తించగా, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మరో నలుగురు పోలీసులను గమనించి పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి రూ.13,200 నగదు, ఒక ఆటో, రెండు సెల్ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మండలంలో పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై రమేష్ హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
Ramayana Movie | ఆస్కార్ బరిలో ‘రామాయణ’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

