బస్‌పాస్ జారీలో గందరగోళం
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది ఆర్టీసీ బస్‌పాస్ విభాగం పరిస్థితి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది బస్ పాస్‌ల జారీలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారు.
- పాస్‌పై ఒక నంబర్.. ఐడీ కార్డులో మరొకటి
- ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
- సరిచేయాలని వెళితే నిర్లక్ష్యంగా సమాధానం
సిటీబ్యూరో: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది ఆర్టీసీ బస్‌పాస్ విభాగం పరిస్థితి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది బస్ పాస్‌ల జారీలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. బస్ పాస్‌ల్లో పేర్లలో తప్పిదాలు, రిజిస్ట్రేషన్ సంఖ్యలో మార్పులు, స్టేజీలలో తప్పిదాలు ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇష్టానుసారంగా బస్ పాసులు జారీ అవ్వడంతో ప్రయాణికులు సంబంధిత విభాగాలను ఆశ్రయిస్తే సమస్య పరిష్కరించకపోగా ‘మీకు బస్ పాస్ జారీ చేసిన వ్యక్తి ఈ రోజు లీవ్‌లో ఉన్నాడు. అతడు ఎప్పుడొస్తాడో తెలియదు.
రోజు వచ్చి చూడండి. ఉన్నప్పుడు చేస్కోండి.. లేదా కొత్తది తీస్కోండి.’ అంటూ సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులు బస్ పాస్‌కు నెలవారీ డబ్బులు చెల్లించినా టికెట్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇటీవల శ్రీరాములు గౌడ్ అనే వ్యక్తి నెలవారీ బస్ పాస్ మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ తీసుకున్నాడు. అందుకోసం సర్వీస్ చార్జీతో 1630 చెల్లించాడు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు ఈ బస్ పాస్ వినియోగంలో ఉండాల్సి ఉంటుంది.
అయితే ఈ పాస్‌పై ఆర్ఆర్బీ -ఐడీ 2617160173 ఉంది. ఆర్టీసీ ఐడీ కార్డులో మాత్రం ఆర్ఆర్బీజెడ్ ఐడీ 2617135527 ఉంది. దీంతో ఐడీ కార్డులో ఒక నంబర్, బస్ పాస్‌లో మరో నంబర్ ఉంది. అయితే ఈ బస్సు పాస్‌తో ప్రయాణికుడు తన గమ్యస్థానానికి బస్ ఎక్కగా కండక్టర్ పాస్ చెల్లదని చెప్పాడు. సదరు ప్రయాణికుడు అవాక్కయ్యాడు. అదేంటి బస్సు పాస్ చెల్లదంటున్నారని కండక్టర్‌ను నిలదీయగా ఐడీలో ఒక నంబర్, పాస్‌లో మరో నంబర్ ఉందని వారించాడు. ఆర్టీసీ సిబ్బంది చేసిన తప్పిదానికి తానెందుకు టికెట్‌కు డబ్బులు చెల్లించాలని నిలదీశాడు.
అయితే కండక్టర్ ఆ బస్ పాస్ చెల్లదని బస్ దించాడు. దీంతో సదరు వ్యక్తి సంబంధిత ఈసీఐఎల్ డిపోకు వెళ్లి ప్రశ్నించగా మీకు బస్ పాస్ జారీ చేసిన వ్యక్తి రాలేదని, వచ్చాక రండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ఆ వ్యక్తి ఎప్పుడొస్తాడో తెలియక తన విధులు మానుకొని డిపోకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రోజు నగరానికి, ఇంటికి ప్రయాణించే అతడు రూ.120 టికెట్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. నవంబర్ 8 నుంచి అంటే 5 రోజులకు రూ. 600 వరకు డబ్బులు ఖర్చు చేసుకున్నాడు. పాస్ ఉన్నా ఇలాంటి పరిస్థితి వచ్చిందని బాధితుడు వాపోయాడు. బస్సు పాస్ ముద్రణలో తప్పిదంగా పరిగణించి బస్సులో ప్రయాణానికి అంగీకరించినా తనిఖీ సిబ్బంది తమకు నోటీస్ ఇస్తారని, జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కండక్టర్లు చెబుతున్నారు.
అయితే బస్ పాస్ జారీ చేసే సమయంలోనే ప్రయాణికుడి వివరాలు, ఐడీ నంబర్ , టికెట్ నంబర్ సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉంది. కంప్యూటరైజ్డ్ విధానంలో పాస్‌లు జారీ చేస్తున్నప్పటికీ ఇలాంటి వ్యత్యాసాలు ఎలా చోటుచేసుకుంటున్నయన్నది చర్చనీయాంశంగా మారింది. కొంతమంది అమాయకులు బస్ పాస్ ముఖ్యంగా భావిస్తుండంతో డిపోల చుట్టూ తిరగలేక కొత్త పాస్ తీసుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు. పాస్‌లు జారీచేసే సిబ్బంది ప్రయాణికులతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్లో 43 బస్ పాస్ కేంద్రాల్లో సగానికి పైగా ఇలాంటి తప్పిదాలే కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

