నకిలీ ప్రకటనలు నమ్మి మోసపోవద్దు: టీజీసీఎస్బీ
ఆన్లైన్ షాపింగ్ ఆఫర్లు, నకిలీ ప్రకటనలు, క్రెడిట్/డెబిట్ కార్డుల దుర్వినియోగం ద్వారా మోసం చేసే సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ప్రజలను హెచ్చరించింది.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ షాపింగ్ ఆఫర్లు, నకిలీ ప్రకటనలు, క్రెడిట్/డెబిట్ కార్డుల దుర్వినియోగం ద్వారా మోసం చేసే సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ప్రజలను హెచ్చరించింది. సోషల్ మీడియాలో భారీ డిసౌంట్ల పేరుతో నకిలీ ప్రకటనలు సృష్టించి ముందస్తు చెల్లింపులు చేయించుకుని వస్తువులు డెలివరీ చేయకపోవడం ఒక పద్ధతి కాగా, బ్యాంక్ రివార్డులు లేదా కార్డ్ లిమిట్ పెంపు ఆశ చూపి హానికరమైన లింకులు, ఏపీకే ఫైళ్ల ద్వారా ఓటీపీ, సీవీవీ వంటి రహస్య వివరాలను దొంగిలించి ఖాతాలు ఖాళీ చేయడం మరో పద్ధతిగా గుర్తించారు.
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఆఫర్లు, తెలియని లింకులు లేదా ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని, కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని టీజీసీఎస్బీ సూచించింది. ఏదైనా సైబర్ ఆర్థిక మోసం జరిగితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని లేదా అధికారిక పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

