మూగవాడిగా నటించడం పెద్ద ఛాలెంజ్!
అగ్ర నటుడు నాగార్జున సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పల దర్శకుడు.
అగ్ర నటుడు నాగార్జున సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పల దర్శకుడు. అనస్వరరాజన్ కథానాయికగా నటిస్తున్నది. వెంకీ కుడుముల నిర్మాత. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర హీరో అనీష్ విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఇదొక మూగవాడి ప్రేమకథా చిత్రమని, కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయని అన్నారు. ‘ఈ కథ విన్నప్పుడే తన భావాలను మాటల్లో వ్యక్తపరచలేని వ్యక్తి..ప్రేమను ఎలా వ్యక్తం చేస్తాడు అనే అంశం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
ఎక్కడా నాటకీయత లేకుండా చాలా సహజంగా సాగే కథ ఇది. ఈ సినిమా కోసం దాదాపు ఆరు నెలల పాటు వర్క్‌షాప్స్ నిర్వహించాం. కొన్ని సన్నివేశాల్లో సైన్ లాంగ్వేజ్ ఉపయోగించాం. అయితే అది అందరికి అర్థమయ్యేలా ఉంటుంది’ అన్నారు. ఈ సినిమా విషయంలో నాగార్జున, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి అగ్ర హీరోలు మద్దతుగా నిలిచారని, సినిమా కాన్సెప్ట్, కంటెంట్ నచ్చి వారు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉందని అనీష్ పేర్కొన్నారు. తాను లండన్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చేశానని, వైజాగ్ సత్యానంద్‌తో పాటు యూఎస్‌లో కూడా యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నానని చెప్పారు.
మూగవాడి పాత్రను పోషించే విషయంలో ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడుతూ ‘సాధారణ వ్యక్తి మాటతో సమాధానం చెబుతాడు. కానీ మూగవాడు ఎక్స్‌ప్రెషన్స్‌తోనే స్పందించాలి. అది కొంచెం కష్టంగా అనిపించింది. లిప్‌సింక్ లేకుండా డ్యాన్స్ చేయడం కూడా పెద్ద సవాలుగా అనిపించింది’ అని అన్నారు. ఏదో ఒక జోనర్‌కి పరిమితం కాకుండా ఎమోషనల్ కథల్ని ఎంచుకొని సినిమాలు చేయాలన్నదే నటుడిగా తన లక్ష్యమని అనీష్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

