డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా యూత్ గేమ్స్
తెలంగాణ వేదికగా డిసెంబర్ 11 నుంచి 22 వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వేదికగా డిసెంబర్ 11 నుంచి 22 వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. క్రీడల ఏర్పాట్ల పురోగతిపై కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి హరిరంజన్రావుతో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో రాష్ట్ర క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, శాట్స్ ఎండీ సోని బాలదేవి, సమాచార శాఖ కమిషనర్ ముకుంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా దాదాపు 7 వేల మంది అథ్లెట్లు, కోచ్‌లు, అతిథులు హాజరుకానున్నట్టు చెప్పారు. పోటీల కోసం రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 120 కోట్లు కేటాయించినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు హనుమకొండ, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వేదికల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 11 స్టేడియాలు సిద్ధం కాగా, మరో 5 స్టేడియాల్లో ఆధునికీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

