Home
Telangana
Tngos Call For Chalo Delhi On December 12 To Protest Against Central And State Government Policies
డిసెంబర్ 12న చలో ఢిల్లీ: టీఎన్జీవో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 12న చలో ఢిల్లీ నిర్వహించనున్నట్టు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) ప్రకటించింది.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 12న చలో ఢిల్లీ నిర్వహించనున్నట్టు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) ప్రకటించింది. ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐఎస్జీఈఎఫ్) ఆధ్వర్యంలో రాంలీలా మైదానంలో నిర్వహించే కర్మచారి ఆక్రోశ్ ర్యాలీని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ పిలుపునిచ్చారు.
ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన పీఆర్సీ అమలెప్పుడని ప్రశ్నించారు. పీఆర్సీ లేక ఉద్యోగులు మూడేండ్లు నష్టపోయారని.. 51శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుచేయాలని, పాత పింఛన్ వర్తింపజేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

