గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 09:21:40

రైలు ద‌గ్గరకు వచ్చాక.. ప్రాణాలతో చెల‌గాటం

రైలు ద‌గ్గరకు వచ్చాక.. ప్రాణాలతో చెల‌గాటం

ప‌ట్నా : బీహార్‌లోని రాక్సాల్-నార్కటియాగంజ్ రైల్వే లైనుపై వేగంగా వస్తున్న రైలు దగ్గరికి వచ్చిక కొంత‌మంది పిల్లలు, యువకులు వంతెనపై  నుంచి నదిలోకి దూకుతున్నారు. ఇది రైల్వే అధికారుల‌ను, స్థానికుల‌ను బెంబేలెత్తిస్తున్న ఘటన. కొంత‌ మంది పిల్లలు, యువకులు వెస్ట్ భీహారి గ్రామానికి సమాపంలో ఉన్న కార్తా నదిపై రైల్ బ్రిడ్జ్ నుంచి నదిలోకి దూకుతున్నారు. రైలు వారి దగ్గర‌కు రాగానే, వారు ఒక్కసారిగా  న‌దిలోకి దూకుతున్నారు. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేప‌థ్యంలో ఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎన్‌కె రాయ్, ఆర్‌పీపీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, పురుషోత్తంపూర్ పోలీస్‌స్టేషన్ హెడ్‌ కైలాష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆ పిల్లల‌ను, యువకులను గుర్తించారు. వీరిపై త‌గిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. పిల్లలు దీనిని స్టంట్‌గా భావిస్తూ,  ప్రాణాల‌కు తెగిస్తున్నార‌ని,  త‌ల్లిదండ్రులు పిల్లలను గ‌మ‌నిస్తూ ఉండాల‌ని అధికారులు స్థానికుల‌కు చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo