West Bengal | మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. ప్రభుత్వం రద్దు చేస్తూ ఆదేశాలు.. కొత్త ప్రభుత్వానికి లైన్ క్లియర్
West Bengal : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేయబోనంటూ మొండి పట్టుదలతో ఉన్న మమతా బెనర్జీకి గవర్నర్ షాకిచ్చారు.
West Bengal : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేయబోనంటూ మొండి పట్టుదలతో ఉన్న మమతా బెనర్జీకి గవర్నర్ షాకిచ్చారు. మమత ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. దీంతో 2021–2026 వరకు ఉన్న మమత ప్రభుత్వం అధికారికంగా రద్దైంది. దీంతో ఇకపై మమత సీఎం పదవి కూడా రద్దైంది.
గవర్నర్ నిర్ణయంతో రెండు రోజులుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 (2)బి ఆధారంగా మమత ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. ఈ నిర్ణయం గురువారం, మే 7 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ రద్దు నిర్ణయంపై మమతా బెనర్జీ ఇంకా స్పందించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం ఓటమి పాలైంది. బీజేపీ 207 సీట్లతో అధికారం దక్కించుకుంది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి. కానీ, ఈ ఓటమిని మమత అంగీకరించడం లేదు. తాము ఓడిపోలేదని, బీజేపీ, ఈసీ కలిసి కుట్ర చేసి తమను ఓడించాయని ఆమె ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనని ఆమె అన్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగా ఉత్కంఠకు దారితీసింది. మిగతా రాష్ట్రాల్లో సీఎంలు ఫలితాలు వెలువడ్డ మరునాడే రాజీనామా చేశారు. కానీ, మమత ఇంతవరకు సీఎం పదవికి రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. మరో రెండు రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో కొలువుదీరనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

