కోల్కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన విగ్రహాన్ని తానే రాజ్భవన్లో ఆవిష్కరించారు. ఆయన గవర్నర్గా ప్రమాణం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పార్థ సాహా అనే కళాకారుడు ఈ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. టీఎంసీ నేత జయప్రకాశ్ మజుందార్ స్పందిస్తూ, పబ్లిసిటీ కోసమే గవర్నర్ తన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారన్నారు.
అయితే ఆయన తదుపరి చర్య ఏమిటి? తన విగ్రహానికి తానే పూలమాల వేసుకుంటారా? అని ప్రశ్నించారు. సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు సుజన్ మాట్లాడుతూ, ఇది అత్యంత అమర్యాదకరమని మండిపడ్డారు. ఇది రాష్ర్టానికి దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సౌమ్య మాట్లాడుతూ, గవర్నర్ తీరు సిగ్గుచేటు అన్నారు. బెంగాల్ సంస్కృతితో ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.