కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. తనకు, తన మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి రక్షణ లేదన్నారు. తమను బీజేపీ టార్గెట్ చేస్తున్నదని ఆరోపించారు.
కాషాయ పార్టీ కుట్రలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. టీఎంసీ నేతలకు, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలకు ప్రతి ఒక్కరూ రక్షణగా నిలవాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేత సువేందు అధికారి శనివారం మాట్లాడుతూ.. సోమవారం పెద్ద విస్పోనం జరుగుతుందని, దానివల్ల టీఎంసీ, దాని అగ్ర నేతలు వణికిపోతారని వ్యాఖ్యానించారు.