ముంబై: ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను.. టాటా సన్స్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. 18 వేల కోట్లకు టాటా సన్స్.. దివాళా దశలో ఉన్న ఎయిర్ ఇండియాను కైవసం చేసుకున్నది. దీనిపై టాటా గ్రూపు అధినేత రతన్ టాటా ఇవాళ స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆయన రియాక్ట్ అయ్యారు. ఎయిర్ ఇండియాకు స్వాగతం పలుకుతున్నట్లు ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియా బిడ్ను టాటా గ్రూపు గెలుచుకోవడం గొప్ప విషయమన్నారు. ఎయిర్ ఇండియాను పునర్ నిర్మిస్తామని, విమానయాన రంగంలో టాటా గ్రూపు తన మార్కెట్ సత్తాను మరోసారి చాటుతుందని అన్నారు. జేఆర్డీ టాటా నాయకత్వంలో ఒకప్పుడు ప్రపంచంలో ఎయిర్ ఇండియాకు మంచి గుర్తింపు ఉండేదని, ఆనాటి వైభవాన్ని తిరిగి పొందుతామని, జేఆర్డీ టాటా ఇప్పుడు ఉండి ఉంటే, ఆయన ఎంతో సంతోషించేవారన్నారు. ప్రైవేటు రంగాల్లోకి ఎంపిక చేసిన పరిశ్రమలను మాత్రమే ఆహ్వానించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని స్వాగతిస్తున్నట్లు కూడా రతన్ టాటా తన ట్వీట్లో తెలిపారు.
Welcome back, Air India 🛬🏠 pic.twitter.com/euIREDIzkV
— Ratan N. Tata (@RNTata2000) October 8, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Air India | ఎయిరిండియా అప్పులు రూ.60వేల కోట్ల పైచిలుకే!
Air India to TATA | ఏడాదిపాటు ఎయిరిండియా ఉద్యోగులకు నో ఉద్వాసన
TATA Takeover Air India | 68 ఏండ్లకు టాటాల గూటికి ఎయిర్ ఇండియా..!
Air India to TATA’s | టాటా చేతికే మహారాజా..