Air India | ఎయిరిండియా అప్పులు రూ.60వేల కోట్ల పైచిలుకే!
Air India | ఎయిరిండియా అప్పులు రూ.60 వేల కోట్ల పై చిలుకే. రూ.14,718 కోట్ల ఆస్తులు ప్రభుత్వాధీనంలోనే ఉంటాయి.

Air India | ఏండ్ల తరబడి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు శుక్రవారం ముగింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇక టాటా సన్స్ పరమైంది. మహారాజాగా పేరొందిన ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాల ప్రైవేటీకరణకు ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. అత్యధికంగా టాటా సన్స్ రూ.18 వేల కోట్లకు బిడ్ దాఖలు చేసి, ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్నది.
ఈ బిడ్ ప్రకారం ఎయిర్ ఇండియాను టేకోవర్ చేయడంతోపాటు 50 శాతం ఎయిర్ ఇండియా సాట్స్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాటాలు టాటా సన్స్ పరం అవుతాయి. ఎయిర్ ఇండియా విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.2,700 కోట్ల నగదు అందుతుంది. మిగతా మొత్తం ప్రభుత్వ రుణాల కింద జమ అవుతుంది. ఎయిర్ ఇండియా మొత్తం రుణాలు రూ.60 వేల కోట్ల పై చిలుకే.
ఎయిర్ ఇండియా వాటాల విక్రయ ఒప్పందంలో సంస్థ భూములు, భవనాలతోపాటు నాన్ కోర్ ఆస్తులను చేర్చలేదు. రూ.14,718 కోట్ల విలువైన ర్ ఇండియా భవనాలు, భూములు, ఇతర ఆస్తులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఏఐఏహెచ్ఎల్కు హ్యాండోవర్ అవుతాయి. భారత్లో 1932లో టాటా ఎయిర్ సర్వీసెస్ పేరిట విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తిరిగి 68 ఏండ్లకు టాటా సన్స్ చేతికి ఎయిరిండియా చిక్కింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

