DK Shivakumar | బంగారం స్మగ్లింగ్ కేసు (gold smuggling case)లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో కర్ణాటక హోంమంత్రి (Karnataka Home Minister) జి.పరమేశ్వర (G Parameshwara) మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంస్థకు రన్యారావుకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తాజాగా స్పందించారు. రన్యారావుకు మంత్రి పరమేశ్వర వెడ్డింగ్ గిఫ్ట్ ఇచ్చినట్లు చెప్పారు. అందులో తప్పేముంది అంటూ ప్రశ్నించారు.
మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న తుమకూరులోని శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. రాన్యా రావుకు, మెడికల్ కాలేజీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పరమేశ్వర ఇంటికి డీకే శివకుమార్ వెళ్లారు. వివాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రన్యారావు వివాహానికి హాజరైన పరమేశ్వర.. గిఫ్ట్ ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంతోమందిని కలుస్తుంటామని అన్నారు. పెళ్లిళ్లకు హాజరై బహుమతులు ఇస్తుంటామని.. అది సహజమేనన్నారు. ఇందులో భాగంగానే రన్యారావు పెళ్లికి కూడా పరమేశ్వర గిఫ్ట్ ఇచ్చారని తెలిపారు. ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నించారు. డీకే వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కన్నడ నటి అయిన రన్యారావును మార్చి 3న బంగారం స్మగ్లింగ్ కేసులో డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకొని.. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో తరుణ్ రాజ్, సాహిల్ సకారియా జైన్లను కూడా అ ధికారులు అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో రన్యారావుకు బెయిల్ కూడా మంజూరైంది. అయితే, ఈ కేసులో మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. రాన్యా రావుకు, మెడికల్ కాలేజీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో, అధికారులు బుధవారం ఉదయం కళాశాలలో తనిఖీలు చేపట్టారు. కాలేజీకి సంబంధించిన పలు రికార్డులు, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది.
Also Read..
PM Modi | ఏప్రిల్ 22 ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం.. పాక్‌ను మోకరిల్లేలా చేశాం : ప్రధాని మోదీ
S Jaishankar | అమెరికా.. అమెరికాలోనే ఉంది.. పాక్‌తో సంధి విషయంలో యూఎస్ పాత్రపై జైశంకర్ క్లారిటీ
IndiGo | గగనతలంలో భారీ కుదుపులకు లోనైన విమానం.. వీడియో వైరల్