IndiGo | ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు (Turbulence) లోనైన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ వర్షం కారణంగా ఢిల్లీ నుంచి 200 మందికిపైగా ప్రయాణికులతో శ్రీనగర్ బయల్దేరిన ఇండిగో విమానం 6ఈ2142 ఆకాశంలో తీవ్ర కుదుపులకు లోనైంది.
ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు (Passengers Scream) గురయ్యారు. మరోవైపు వడగళ్ల వాన కారణంగా విమానం నోస్ కోన్ దెబ్బతింది. అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సంకేతాలు పంపించారు. అనంతరం శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న (Aircraft Damaged), ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
I had a narrow escape while flying from Delhi to Srinagar. Flight number #6E2142. Hats off to the captain for the safe landing.@IndiGo6E pic.twitter.com/tNEKwGOT4q
— Sheikh Samiullah (@_iamsamiullah) May 21, 2025
Also Read..
Delhi-NCR Storm | వర్షం, ఇసుక తుపానుకు అతలాకుతలమైన ఢిల్లీ-ఎన్సీఆర్.. ఆరుగురు మృతి
Coronavirus | కేరళను వణికిస్తున్న కరోనా మహమ్మారి.. మే నెలలోనే 182 కేసులు నమోదు
National Herald case | సోనియా, రాహుల్‌ది ఆర్థిక నేరమే! రూ.142 కోట్ల అనుచిత లబ్ధి పొందారు