Southwest Monsoon | చల్లని కబురు.. కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. వారంలోపే తెలంగాణలోకి..!
Southwest Monsoon | ఇంతకాలం మండుటెండల (Heat waves) తో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు వచ్చేసింది. కేరళ (Kerala) కి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించాయి. దాంతో కేరళ తీర ప్రాంతాల్లో (Coastal Areas) భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. మరో వారంలోపే ఈ రుతుపవనాలు తెలంగాణ (Telangana) లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
Southwest Monsoon : ఇంతకాలం మండుటెండల (Heat waves) తో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు వచ్చేసింది. కేరళ (Kerala) కి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించాయి. దాంతో కేరళ తీర ప్రాంతాల్లో (Coastal Areas) భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. మరో వారంలోపే ఈ రుతుపవనాలు తెలంగాణ (Telangana) లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాలు కొంత ఆలస్యంగా వచ్చాయి.
వాస్తవానికి మే 26వ తేదీననే నైరుతి రుతపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగా అంచనా వేసింది. కానీ, ఎల్నినో ప్రభావంతో ఆ అంచనాలు తలకిందులయ్యాయి. కాగా రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలప్పుళ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అటు తమిళనాడులోని 15 జిల్లాల్లోనూ రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక జారీచేసింది.
ఇదిలావుంటే.. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో (జూన్-సెప్టెంబర్) సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షమే ఈ సీజన్లో కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎల్నినో పరిస్థితులు ఆవిర్భవిస్తున్నాయని, జూన్లో ఇవి బలహీనంగా ఉన్నా సెప్టెంబర్లో మాత్రం బలంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

