Water Crisis : ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది. నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
చత్తార్పూర్ ప్రాంతంలో పెద్దసంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు జల్ బోర్డు కార్యాలయం వద్ద నిరసనలకు దిగారు. అయితే ఈ ఘటనపై బీజేపీ నేత రమేష్ బిధూరి స్పందించారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఏమైనా చేయగలరని అన్నారు.
ప్రజలను శాంతింపచేసి బీజేపీ కార్యకర్తలు వారిని నిలువరించారని చెప్పారు. ఇది ప్రజల, ప్రభుత్వ ఆస్తి అని, వీటిని ధ్వంసం చేయడం తగదని అన్నారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#WATCH | Delhi Jal Board office was seen being vandalised by some BJP workers in Chhatarpur area
BJP leader Ramesh Bidhuri said, “The people can do anything when they are angry. I am grateful to the BJP workers who controlled the people. It is the government’s and people’s… pic.twitter.com/IOkGK0rj8g
— ANI (@ANI) June 16, 2024
Read More :